పార్టీ మార్పు ప్రచారం.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

by Rajesh |   ( Updated:2024-07-01 04:41:09.0  )
పార్టీ మార్పు ప్రచారం.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏ మాత్రం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తా అని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. మంత్రి పదవితో పాటు కుమారుడు కార్తీక్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగగా తాజాగా సబిత క్లారిటీతో ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed