- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి నాగం రాజీనామా
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన నాగంకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి టికెట్టు ఇవ్వడంతో నాగం తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతోను మాట్లాడారు. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన అనుచర వర్గం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దిశకు తెలిపారు. కాగా, ఆయన బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సాయంత్రం నాగంను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకటి రెండు రోజులలో నాగం బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్‌లో చేరగా ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి సైతం బీఆర్ఎస్‌లో చేరుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.