- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాం.. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశాం.. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు అయ్యిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ మాయం అయ్యాయని.. పదేళ్ల కిందటి సమస్యలు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. అధికారంలోకి వచ్చాక దళిత బంధు పథకాన్ని రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కకడ నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు మౌనంగా ఉండకుండా పోరాడి సాధించుకోవాలని సూచించారు.