- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద.. మూసీవేయనున్న గేట్లు
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు ఆ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి మాత్రమే నీరు వస్తుంది. దీంతో గత వారం రోజుల తో పోలిస్తే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా తగ్గింది. ఈ క్రమంలో జలాశయం 3 గేట్లను మాత్రమే ఎత్తిన అదికారుల దిగువకు 1,47,247 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఎగువ నుంచి శ్రీశైలానికి 80, 499 క్యూసెక్కుల వరద వస్తుంది. కాగా శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం డ్యామ్ లో 881.30 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే వరద నీటితో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలు సహాయంతో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతాల నుంచి వరద పూర్తిగా తగ్గడంతో ఈ రోజు సాయంత్రం, లేదా రేపు ఉదయం శ్రీశైలం డ్యామ్ గేట్లను మూసి వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మూడు గేట్లను మరో రెండు రోజులపాటు కూడా కొనసాగిస్తారని తెలుస్తుంది. కాగా ఈ గేట్ల మూసివేత పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.