ఫామ్ హౌజ్​ఫైల్స్​ప్లాప్.. కేసీఆరే ప్రధాన సూత్రదారి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

by Nagaya |   ( Updated:2022-12-27 15:22:52.0  )
ఫామ్ హౌజ్​ఫైల్స్​ప్లాప్.. కేసీఆరే ప్రధాన సూత్రదారి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫామ్​హౌజ్​ఫైల్స్​డ్రామా ప్లాప్​అయిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఎం కేసీఆర్​సూత్రదారి అని మరోసారి నిరూపితమైనదని వెల్లడించారు. స్క్రీన్​ప్లే, దర్శకత్వం, ప్రొడ్యూసర్‌గా సీఎం అవతారమెత్తి బీజేపీపై బురద జల్లేందుకు కొత్త యాక్టర్స్‌తో ప్రయత్నాలు చేసినట్లు విమర్శించారు. కానీ కోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు అని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తన అసమర్ధ పాలనను కప్పి పుచ్చుకునేందుకే బీజేపీపై కుట్రలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ సారి కొత్త విధానాలతో బీజేపీపై విష ప్రచారం చేయడం కేసీఆర్​కు అలవాటేనని చెప్పుకొచ్చారు.ఇతరులపై బురద చల్లడం కేసిఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకొచ్చారు. న్యాయస్థానం కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలు వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. కేసిఆర్ కుటుంబానికి , పార్టీకి ఎవరైనా ప్రత్యామ్నాయంగా వ్యక్తులు, శక్తులు ఎదిగితే వాళ్ల ఇమేజ్ ను దెబ్బతీసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడన్నారు.

చివరకు హై కోర్టు మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ కేసును సిట్ నుంచి సీబిఐ కి ఇవ్వాలని అప్పజెప్పడంతో కేసీఆర్​కు భయం పట్టుకున్నదన్నారు.ఫామ్​ హౌజ్​కేసు నిష్పక్షపాతంగా జరగట్లేదు హై కోర్టు అనుమానం వ్యక్తం చేసిందన్నారు. ముగ్గురు ఎమ్మెల్యే ల ఫోన్ లు ఎందుకు రికవరీ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్​ పార్టీలో ఉన్నోళ్లలో 90 శాతం పార్టీ ఫిరాయింపు దారులేనని చెప్పుకొచ్చారు. బీజేపీకి స్వామీజీల అవసరం లేదని చెప్పారు.

రామప్ప టెంపుల్‌కు రూ.10 కోట్లు

రామప్ప టెంపుల్‌కు రూ.10 కోట్లను ఖర్చు చేస్తూ డెవలప్​మెంట్ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఇక అతి త్వరలో తెలంగాణకు వందే భారత్ ట్రైన్ రాబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు నడపాలనే యోచనలో కేంద్రం ఉండగా, వైజాక్​వరకు కొనసాగించాలని తాను రిక్వెస్ట్​చేసినట్లు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు వందే భారత్​రైల్‌ను విస్తరింప చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయన్నారు.

Advertisement

Next Story