తెలంగాణ అసెంబ్లీలో ‘‘ఫ్యామిలీ’’ సందడి

by Satheesh |
తెలంగాణ అసెంబ్లీలో ‘‘ఫ్యామిలీ’’ సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. అయితే, గవర్నర్ ప్రసంగంలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రత్యేక ఆకర్షణీయంగా పలువురు శాసనసభ్యులు నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన పలువురు లీడర్లతో సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి బ్రదర్స్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బ్రదర్స్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి తండ్రి తనయులు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత (అన్నా చెల్లలు) మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి (మామ అల్లుళ్ళు) ఉభయ సభల సంయుక్త సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.

Advertisement

Next Story

Most Viewed