- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్ళి చూపులతో అడ్డంగా దొరికిన నకిలీ మహిళా ఎస్‌ఐ..
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ యువతి పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో నకిలీ ఎస్ఐగా మారింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ అందరినీ నమ్మించింది. చివరికి పెళ్లి సంబంధంతో విషయంలో ఆమె బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. 2018 లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసిన మాళవిక దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్ లో దృష్టి లోపం కారణంగా ఆమె తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్‌ఐ అవుతున్నట్లు చెప్పుకుంది. దీంతో తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. ఏడాది నుంచి ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకున్నట్లు తెలిసింది.
ఇటీవల ఆమెకు ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు చూశారు. పెళ్లి సంబంధం చూసేందుకు ఆమె ఎస్ఐ యూనిఫాంలో వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అబ్బాయి తరపు వారు ఆమె గురించి వాకబు చేశారు. వాళ్లు అధికారులను సంప్రదించగా అసలు విషయం తెలిసింది. దీంతో నల్గొండలో మళవికను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.