Face Recognition: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ స్టార్ట్.. ఉ.10 గంటలకే చేరుకున్న ఉద్యోగులు

by Prasad Jukanti |   ( Updated:2024-12-12 06:13:26.0  )
Face Recognition: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ స్టార్ట్.. ఉ.10 గంటలకే చేరుకున్న ఉద్యోగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (Facial recognition Attendance) విధానం అమల్లోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ నమోదు చేశారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం (Secretariat) హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ విధానం వర్తింపజేశారు. ఇందుకోసం సచివాలయంలో మొత్తం 60కి పైగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో రోజువారీ అటెండెన్స్ అమల్లకి రావడంలో ఉ.10గంటలకే ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు. కాగా సమయ పాలన, భద్రత దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నిషన్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం (Telangana Govt) కసరత్తు చేస్తోంది. కొంత మంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 దాటినా హాజరుకాకపోవడంపై ఇప్పటికే పలు సందర్భంల్లో మంత్రులు సీరియస్ అయ్యారు.ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఇవాళ్టి నుంచి కొత్త విధానంలో అటెండెన్స్ తీసుకోవడం ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed