తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు

by Satheesh |   ( Updated:2023-11-30 13:32:52.0  )
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనున్నదని పలు జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ప్రీ-పోల్ సర్వేలకు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్ అంచనాలనూ వెల్లడించాయి. పోలింగ్ సరళిని పరిగణనలోకి తీసుకున్న పలు సర్వే సంస్థల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కనుందనే క్లారిటీ ఇచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని ఫస్ట్ ప్లేస్‌లోకి వస్తున్నదని, పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి రెండో స్థానంలోకి వెళ్ళనున్నట్లు పేర్కొన్నాయి. బీజేపీ గతంకంటే కాస్తు పుంజుకుని ఆరేడు సీట్ల వరకు వచ్చినా సింగిల్ డిజిట్ దాటే అవకాశం లేదని పేర్కొన్నాయి. మజ్లిస్ గతంలో ఉన్నట్లుగానే తన స్థానాలను పదిలం చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

గతం కంటే (88 సీట్లు) రెండు స్థానాలు ఎక్కువే వస్తాయని ధీమాగా చెప్పిన బీఆర్ఎస్ 95-105 మధ్యలో ఉంటాయని ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం 80 సీట్లలో గెలుస్తున్నదని, డిసెంబరు 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఫుల్ కాన్ఫిడెన్సును వ్యక్తం చేసింది. ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా జరిగినా కొన్ని స్థానాల్లో బీజేపీ ఎంట్రీతో ముక్కోణపు పోటీగా మారింది. రెండు ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న విశ్వాసాన్ని కనబర్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మాత్రం బీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను గతంతో పోలిస్తే గణనీయంగా కోల్పోతుండగా కాంగ్రెస్ మాత్రం గతం కంటే మూడు రెట్లు పెరుగుతున్నట్లు తేలింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి :

Advertisement

Next Story

Most Viewed