పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్

by Mahesh |   ( Updated:2023-12-28 07:08:53.0  )
పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.దీంతో ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ పార్టీని వీడడం లేదని.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అలాగే తాను బీజేపీలో ఉండటం ఇష్టం లేని వారు ఇలా చేస్తుండొచ్చని ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఈటల స్పష్టం చేశారు.

Advertisement

Next Story