BREAKING: కాంగ్రెస్ నేతలను కలవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన ఈటల

by Satheesh |   ( Updated:2024-02-17 11:06:58.0  )
BREAKING: కాంగ్రెస్ నేతలను కలవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీ కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్‌ను వీడి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంత్ రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలతో ప్రైవేట్‌గా ఈటల భేటీ అయిన ఫొటో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈటల బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో భేటీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను ఖండించారు. మన్సురాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో అప్పుడు తీసిందేనని చెప్పారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలతోనే భేటీ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ ఫంక్షన్‌లో అందరితో కలిసి ఉన్న ఫొటోపై దుష్ర్పచారం చేయడం దుర్మార్గమని సీరియస్ అయ్యారు.

ఇక, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఈటల ఓటమి పాలైన విషయం తెలిసిందే. తన సొంత ఇలాకా హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన ఈటల.. మాజీ సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో సైతం బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైన ఈటల.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దేశంలో అతిపెద్దదైన మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసేందుకు ఈటల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed