కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ వల్ల కాదు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ వల్ల కాదు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ డిక్లరేషన్‌కు అతి గతీ లేదు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ వేములవాడ‌కు వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏవైనా ప్రకటిస్తారని ఆశించామని, కానీ ఎంత‌సేపు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అనడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ వల్ల కాదు.. కాంగ్రెస్‌లో మరెవ్వరి వల్ల కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని.. కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి తీయలేదన్నారు.

రేవంత్‌రెడ్డి తిట్టడం మీద కాదు అభివృద్ధి మీద దృష్టి సారించాలని హితవు పలికారు. మళ్లీ రేవంత్ కరీంనగర్ వస్తానంటున్నారని, కనీసం అప్పుడైనా జిల్లా పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 29న దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడితే అరెస్టులు చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. వేములవాడ, సిరిసిల్ల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వేముల‌వాడ, సిరిసిల్లలో కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సృష్టించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. రేవంత్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టిన ఘనత రేవంత్‌ది అని మండిపడ్డారు. ఫార్మా సిటీ ఉండగా మళ్లీ ఫార్మా‌ కంపెనీలకు భూసేకరణ ఎందుకు.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి చూపించాలని సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed