- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌పై విద్యా శాఖ కసరత్తు.. టీచర్ల ప్రమోషన్లపై తర్జనభర్జన
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు నిర్ణయాలతో అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. బడి లేని గ్రామం, పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 1.78 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టుల సంఖ్య ఏ మాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన అప్పటి ప్రభుత్వం స్పందించ లేదు. పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడంతో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.
అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ వేసి ఆరు నెలల్లో టీచర్ పోస్టలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అందుకు తోడు డీ.ఎడ్, బీ.ఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల కాలంలో మంత్రులను, అధికారులను కలిసి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూలత వాతావరణం ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. గతంలో జారీ చేసిన 5,089 పోస్టులకు మరో 5 వేల టీచర్ పోస్టులు, అదేవిధంగా 2 వేల స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి మొత్తం మీద దాదాపు 12 వేల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి, పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలనే హైకోర్ట్ ఆదేశాల ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష, టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తరువాతే డీఎస్సీ ఇవ్వాలంటే అందులోనూ కోర్టు చిక్కులతో చాలా కాలయాపన అయ్యే అవకాశం ఉన్నందున డీఎస్సీ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన డీఎస్సీకి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు. టీచర్ల టెట్ బదిలీలు, ప్రమోషన్లు ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో 7, 8 నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరో వారం రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.