వేకువజాము అగ్ని ప్రమాదం...ఖాళీ బూడిద అయిన హోటల్..

by Anjali |
వేకువజాము అగ్ని ప్రమాదం...ఖాళీ బూడిద అయిన హోటల్..
X

దిశ,బోథ్: బోథ్ మండల కేంద్రంలోని పాత అంగడి బజార్‌లోని హోటల్ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వలన సోహెల్ అనే యువకుడి హోటల్ పూర్తిగా దగ్దం అయింది. ఉదయాన్నే రోజు వారిలా హోటల్ తీసి నడుపుతుండగా.. ఒకేసారి పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌లో విలువైన ఫ్రిడ్జ్, టీవీ మరిన్ని వస్తువులు దగ్దం అయ్యాయి. ఫైర్ బోథ్ మండల కేంద్రంలో ఫైర్ ఇంజన్ ఉంటే ఇలా ప్రమాదాలు ఆపవచ్చు కానీ ఫైర్ ఇంజన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనీ, పలువురు వాపోయారు. ఇప్పటికీ అయిన ఫైర్ ఇంజన్ ఏర్పాటు చెయ్యాలనీ కోరారు. బాధితుడికి ప్రభుత్వం తరుపున సహాయం అందించాలి అని కోరారు.

Advertisement

Next Story