- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డార్క్ వెబ్‌లో డ్రగ్స్ దందా.. క్రిప్టో కరెన్సీ లో చెల్లింపులు
దిశ, క్రైమ్ బ్యూరో: డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను ఆర్డర్ చేసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ గుట్టును టీజీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బయట పెట్టింది. టీజీ నాబ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ (హెరాయిన్ )ను ఆర్డర్ చేశాడు. ఈ డ్రగ్స్‌కు పేమెంట్‌ను క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించినట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సాంకేతిక విభాగం, ఖమ్మం పోలీస్ అధికారులు పసిగట్టారు. అయితే ఈ డ్రగ్స్ ఆర్డర్ అస్సాం సిల్పుఖురి నుంచి ఖమ్మం కి డెలివరీ అవుతున్న కన్సైన్మెంట్ నెంబర్ ను ట్రేస్ చేసి ఆ డెలివరీని ట్రాక్ చేశారు. ఈ నెల 8వ తేదిన డెలివరీ అవుతున్న సమయంలో ఖమ్మంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్ ఆర్డర్ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మత్తుకు బానిస అయ్యడని గుర్తించి అతనికి మరెందుకు ఓ అవకాశం కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విధంగా రూట్ మార్చిన డ్రగ్స్ దందా అక్రమార్కుల భరతం పట్టేందుకు డార్క్ వెబ్‌ను కూడా జల్లెడ పడుతున్నట్లు టీజీ నాబ్ అధికారులు హెచ్చరించారు.