DOST -2024 : ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ విడుదల..

by Ramesh N |
DOST -2024 : ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్ విడుదల..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దోస్త్-2024 విద్య సంవత్సరానికి గాను ఇంట్రా కాలేజీ ఫేజ్-2 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) 2024 ద్వారా ఇంట్రా-కాలేజీ ఫేజ్-2 డిగ్రీ అడ్మిషన్లు ప్రకటించింది.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌, దోస్త్ కన్వీనర్ లింబాద్రి, తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంట్రా కాలేజీ ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 22 నుంచి 23 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 24 వ తేదీన ఫేజ్-2 సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

Advertisement

Next Story