- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం.. మాజీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జిల్లాలో జరిగే సమావేశానికి అమిత్ షా హాజరు కాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై బీజేపీ ఉద్యమాలు చేసిందని అన్నారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని.. ప్రధాన మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టి మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలిపారు. పాలమూరు లోక్‌సభ స్థానంలో గెలుపు కోసం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన పార్టీ బీఆర్ఎస్ అని, అందువల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని విమర్శించారు.
ఒక మహిళా గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని జోస్యం చెప్పారు. కాగా, జనవరి 28న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నేరుగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు.