‘ఇదెక్కడి నీచ రాజకీయం’.. రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

by Prasad Jukanti |
‘ఇదెక్కడి నీచ రాజకీయం’.. రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రేవంత్ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఒక ముఖ్య మంత్రిగా ఉన్న రేవంత్ అరు సార్లు వచ్చారు అంటే కాంగ్రెస్ కు ఓటమి భయం మొదలైందని అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నిన్న కొడంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణతో తనకు పోటీ, పొంతన ఏంటన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె రేవంత్ రెడ్డికి తాను పోటీకానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తిట్టడమే కాకుండా ఆయన చెంచాలతో నీతి వాక్యాలు పలికిస్తున్నాడని వాళ్ల మీద వాళ్లకే నమ్మకం లేక ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నారని ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఓట్లేస్తారా? ఇదెక్కడి నీచ రాజకీయం అని ప్రశ్నించారు. దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. అధికారం కోసం హామీలు ఇవ్వడం ఆతర్వాత మోసం చేడ‌యం కాంగ్రెస్ కు అల‌వాటేనని కాంగ్రెస్ హామీల‌పై రేవంత్ మాట్లాడిన వీడియో చూపించి మ‌రీ ప్రశ్నించారు. డిసెంబర్ 9 తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని చెయ్యలేదని మహిళలకు భృతి, పెన్షన్ రూ.4 వేలకు పెంపు, రైతులకు బోనన్ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రైల్వే లైన్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ది, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, చట్ట సభల్లో మహిళలకు 33 % రిజర్వేషన్ బిల్లు, ముద్ర లోన్స్, నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం, కిషన్ సమ్మాన్ యోజన వంటి అనేక కార్యక్రమాలను మోడీ ప్రభుత్వ హయాంలో చేపట్టినట్లు తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అన్ని వార్గాల నమ్మకాన్ని ఆ పార్టీ కోల్పోయిందన్నారు. తనకు వస్తున్న ఆధరణను చూసి ఓర్నవలేకే కాంగ్రెస్ ఈ తరహా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed