పత్రికా రంగంలో ‘దిశ’ ప్రభంజనం : ఎనుముల తిరుపతి రెడ్డి

by Sathputhe Rajesh |
పత్రికా రంగంలో ‘దిశ’ ప్రభంజనం : ఎనుముల తిరుపతి రెడ్డి
X

దిశ, కోస్గి: పత్రికా రంగంలో ‘దిశ’ ప్రభంజనం అని కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుముల తిరుపతి రెడ్డి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఒరవడితో పాఠకులకు అనుక్షణం సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ నవయుగానికి ‘దిశ’ ఆన్ లైన్ పత్రిక అనతికాలంలోనే చేరువ కావటం విశేషమన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోనీ గాంధీభవన్ పార్టీ కార్యాలయంలో 2024 ‘దిశ’ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొంది అందరి గుండెల్లో పదిలమై ‘దిశ’ పత్రిక డిజిటల్ పత్రికా రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని కొనియాడారు. రోజుకు నాలుగు పత్రికలను విడుదల చేస్తూ గంటగంటకు సేకరిస్తున్న సమచారాన్ని పాఠకులకు నిరంతరంగా అందిస్తూ ‘దిశ’ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అభినందనీయం అన్నారు. ముఖ్యంగా పేపర్‌తో పని లేకుండా పాఠకుడికి ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం అరచేతిలోని సెల్ ఫోన్‌లో ‘దిశ’ పత్రికను వీక్షించేందుకు తీసుకున్న యాజమాన్య నిర్ణయం హర్షణీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు వార్ల విజయ్ కుమార్, సింగిల్ విండో చైర్మెన్ భీమ్ రెడ్డి, కౌన్సిలర్లు గోవర్ధన్ రెడ్డి, ఇద్రీస్, మాస్టర్, శ్రీనివాస్, తుడుం శ్రీనివాస్, బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ కోస్గి పట్టణ అధ్యక్షుడు బెజ్జు రాములు, నాయకులు అన్న కిష్టప్ప, లక్ష్మినారాయణ రెడ్డి, సంజీవ రెడ్డి, దోమ రాజేశ్వర్, రాములు, వెంకటేష్, దిశ కోడంగల్ నియోజకవర్గ ప్రతినిధి సల్మాన్ రాజ్, దిశ విలేకర్లు సాయిరాజ్, షఫీ, రమేష్ గౌడ్ మరియు ఇతర పాత్రికేయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed