వందశాతం ఆ బాధ్యత అధికారులదే.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-19 16:12:03.0  )
వందశాతం ఆ బాధ్యత అధికారులదే.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుకుల పాఠశాలల స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్నదని తెలిపారు. విద్యార్థులకు వసతుల కల్పనపై ఈనెల 29లోగా చెక్ లిస్టు తయారు చేయాలని ఆదేశించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత అధికారులదే అని అన్నారు. కాగా, రాష్ట్రంలోని అనేక గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాదు.. అపరిశుభ్రతకు నిలయంగా మారాయని, క్లాస్‌ రూంలకు డోర్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ఆ సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed