CWC మీటింగ్ హాల్‌కు నేమ్ ఫిక్స్.. ఊహించని పేరుపెట్టిన కాంగ్రెస్..!

by Satheesh |
CWC మీటింగ్ హాల్‌కు నేమ్ ఫిక్స్.. ఊహించని పేరుపెట్టిన కాంగ్రెస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగే మందిరానికి భారత్ జోడో హాల్ అని పేరు ఖరారైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భారత్ జోడో యాత్ర సెకండ్ ఫేజ్‌పై చర్చ జరిగిన అనంతరం ప్రాథమికంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిపిన ఫస్ట్ ఫేజ్ భారత్ జోడో యాత్రతో పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో దాని పేరునే మీటింగ్ హాల్‌కు పెట్టుకున్నది పార్టీ నాయకత్వం. తాజ్ కృష్ణ హోటల్‌లోని థర్డ్ ఫ్లోర్‌లోని బాల్ రూమ్‌లో ఈ సమావేశం జరుగుతున్నా ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని భారత్ జోడో హాల్ అని పిల్చుకోవడం గమనార్హం.

Advertisement

Next Story