సికింద్రాబాద్‌లో లాఠీచార్జ్‌పై క్లారిటీ ఇచ్చిన సీపీ

by karthikeya |
సికింద్రాబాద్‌లో లాఠీచార్జ్‌పై క్లారిటీ ఇచ్చిన సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేసిన ఘటన ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ సికింద్రాబాద్‌లోని ఆలయ సమీపంలో ఆదివారం నాడు హిందూ సంఘాలు ఆందోళను దిగారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేసిన వీడియోలు బయటకు రావడంతో.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ సోసల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా.. దీనిపై తాజాగా నేడు (సోమవారం) సీపీ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేశారు. అందులో ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు, కర్రలతో దాడులు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను షేర్ చేసిన సీపీ.. ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తాము లాఠీచార్జ్ చేయలేదని, అదుపుతప్పి దాడులకు దిగితే శాంతిభద్రతలను పరిరక్షించేందుకు దాడులు చేశామని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌లను నమ్మవద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed