- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ ఎన్నికలే టార్గెట్.. పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ ఆల్టిమేటం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలతో రెండో రోజు సమీక్ష సమావేశం ఈ రోజు (బుధవారం) నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ ఆల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, కార్పొరేషన్ చైర్మన్‌లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే సమావేశానికి ముందు వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. కార్యకర్తల అత్యుత్సాహంతోనే నేతల మధ్య సమస్యలు వచ్చాయని, కొందరు వరంగల్ నేతలు తనని కలిశారని, సమస్యలు పరిష్కరించుకోవాలని వారికి సూచించామని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను తాము సరి చేసుకుంటామని, అతి త్వరలో సమస్యలన్నీ తీరిపోతాయని పేర్కొన్నారు.