- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో ఎవరూ చేరాల్సిన అవసరం లేదు: MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: నేతల చేరికలతో టీకాంగ్రెస్‌లో సందడి వాతావరణం నెలకొన్న తరుణంలో ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని పార్టీలోకి ఎవరూ కొత్తగా చేరాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలు కాంగ్రెసే గెలుస్తుందన్నారు. బుధవారం రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రేతో పాటు రేవంత్ రెడ్డి మరికొంత మంది సీనియర్లతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నివాసంలో సమావేశానికి ఆహ్వానించారు.
ఈ భేటీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించానని ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై వ్యూహరచన చేయబోతున్నామన్నారు. చేరికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారనే ప్రచారం వేళ జిల్లాకు చెందిన అన్ని స్థానాలు ఇప్పటికే రిజర్వ్ చేయబడ్డాయని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.