కాంగ్రెస్ మీడియా టీమ్..​7 సభ్యులతో నియామకం

by Vinod kumar |   ( Updated:2023-08-25 16:52:16.0  )
కాంగ్రెస్ మీడియా టీమ్..​7 సభ్యులతో నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కో–ఆర్డినేటర్స్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఎస్‌వి రమణి, మనిష్​కందూరి, నీరజ్ మిశ్రా, అలి మెహ్దీలను హైదరాబాద్‌కు, డోలి శర్మ వరంగల్‌కు, గుప్తా సేథ్ కరీంనగర్‌కు, బీఆర్ అనిల్ కుమార్‌ను ఖమ్మంకు నియమించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఈ టీమ్​ పనిచేయనున్నది.

Advertisement

Next Story