సీఎం రేవంత్ రెడ్డి మాదిగ జాతి ఎదగకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు: మోత్కుపల్లి

by Mahesh |
సీఎం రేవంత్ రెడ్డి మాదిగ జాతి ఎదగకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు: మోత్కుపల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంద కృష్ణ మాదిగ తో కలిసి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఆశలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదాని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుపించుకుంటే.. మూడు రోజుల్లోనే రేవంత్ కంటే కేసీఆర్ నయం అనిపిస్తుందన్నారు. యువకుడని సీఎం కుర్చీ ఇస్తే.. తన ఫ్యూడల్ ప్రవర్తనతో మా జాతిని ఎదగకుండా మా మాదిగ జాతిని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మోత్కుపల్లి విమర్శలు కురిపించారు.

ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఊసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. రేవంత్ రెడ్డిని కలుస్తున్న వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని అన్నారు. ప్రగతి భవన్ లో ప్రజాపాలన అని పెట్టి 3 రోజులకే ముసేసిర్రు, ఒక్కసారి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మోత్కుపల్లి ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించక పోవడంతో ఆ పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాగే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు.

Advertisement

Next Story