MLC Kavitha : కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ తేవాలి : ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |
MLC Kavitha : కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ తేవాలి : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : బయ్యారం ఉక్కు పరిశ్రమ(Bayyaram Steel Industry) ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)ప్రకటించడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని..కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.

"బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు" అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని, లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని కేంద్రానికి నివేదించారని తెలిపారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని, 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఐరన్ ఓర్ నాణ్యత లేమి నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed