- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో జనసేనతో పొత్తు.. కాషాయ నేతల్లో కలవరం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు అయింది. సీట్ల సర్దుబాటుపై కూడా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు సీట్లు కేటాయించే చోట బీజేపీ ఆశావాహులు చాలామంది ఉన్నారు. దీంతో బీజేపీ ఆశావాహుల్లో అయోమయం నెలకొంది. బీజేపీ అధిష్టానం ఎక్కడెక్కడ సీట్లు కేటాయిస్తారు? తమ సీటుకు ఎక్కడ ఎర్త్ పడుతుంది? అనే ఆందోళనలో కాషాయ నేతలు ఉన్నారు.
కూకట్‌పల్లి సీటుపై జనసేన ఆశలు పెట్టుకుంది. దీంతో ఆ సీటును ఆశిస్తోంది. కానీ కూకట్ పల్లి బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీలో చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆ సీటును జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు తొలి జాబితాలో మార్పులు చేయాలని చాలామంది నేతలు కోరుతున్నారు. వరంగల్ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ రాకేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక యాకత్‌పుర అభ్యర్థి వీరేందర్ గౌడ్‌ను కూడా మార్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తోన్నారు. వీటిపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.