- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలపై కామెంట్స్.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రుల మాటల యుద్ధంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీపై మంత్రి కామెంట్స్, ఏపీ మినిస్టర్ ఘాటు రిప్లై విషయంలో పవన్ మాట్లాడుతూ.. ఈ అంశం హద్దులు దాటిందన్నారు. నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదన్నారు. ఇది తెలంగాణ లీడర్లకు, ఏపీ మంత్రులకు వర్తిస్తుందన్నారు. హరీష్ రావు ఏ సందర్భంగా ఏపీపై కామెంట్ చేశారో గానీ, వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని ఫైర్ అయ్యారు. హరీష్ వ్యాఖ్యలు బాధిస్తే ఆయననే విమర్శించాలి తప్ప తెలంగాణ ప్రజలను, ఆ ప్రాంతాన్ని కాదన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వైసీపీ మినిస్టర్స్ మాట్లాడటం బాధకరమన్నారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మీ వివాదాల్లోకి ప్రజలను లాగొద్దన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కాగా ఇటీవల మంత్రి హరీష్ రావు తెలంగాణ లో ఉండి ఏపీలో ఓటు హక్కు ఉన్న వారు వెంటనే తమ ఓటు హక్కును ఇక్కడికి మార్చుకోవాలని చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ కామెంట్స్ ఏపీ వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. వచ్చి తమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి చూడాలన్నారు. మంత్రి హరీష్ రావుతో పాటు, కేసీఆర్, కేటీఆర్, కవితలను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి:
టీడీపీలో తారస్థాయికి వర్గ విభేదాలు.. గిరిధర్‌రెడ్డికి అందని సహకారం
సీఎం కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం.. తొమ్మిదిన్నర గంటలు సాగిన ఎంక్వయిరీ