- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘KCR రావాలి’.. అసెంబ్లీ సమావేశాల వేళ CM రేవంత్ కీలక డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేపు (బుధవారం) అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామని.. ప్రధాన ప్రతిపక్ష నాయుకుడిగా కేసీఆర్ ఈ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, హక్కులు, అనుమతులు గురించి అసెంబ్లీ వేదికగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్ తమతో కలిసి రావాలన్నారు. రేపు అసెంబ్లీలో పెట్టబోయే చర్చలో పాల్గొంటేనే కేసీఆర్ తెలంగాణ ప్రజల పక్షాలన నిలబడినట్లని.. లేదంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదిరిగానే కేసీఆర్ కూడా మోడీ దగ్గర మోకారిల్లినట్లుగానే మేం భావిస్తామన్నారు. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల కేటాయింపుల కేంద్ర మొండిచేయి చూపిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై బీజేపీ చూపిస్తోన్న వివక్షకు వ్యతిరేకంగా బుధవారం అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన చర్చకు రావాలని కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.