ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డు ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అది ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ సిటీ అని అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీని మోసం చేసిందని.. పాతబస్తీకి మెట్రో తీసుకురావడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సంరద్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైటెక్ సిటీ నుండి ఎయిర్ పోర్టుకు మొత్తం 32 కిలో మీటర్ల మెట్రో నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు పిలించిందని.. కేవలం సిరాస్థి సంస్థలకు మేలు చేసేందుకే ఆ మార్గంలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని ఫైర్ అయ్యారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుండి ఎయిర్ పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయని.. మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మా ప్రభుత్వం ప్రజల అవసరం, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎల్బీ నగర్ నుండి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించనుందని స్పష్టం చేశారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడుతామని తెలిపారు. రాష్ట్రంలో రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా సరే పాతబస్తీ, ఎయిర్ పోర్టు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతామని తేల్చి చెప్పారు.



Next Story

Most Viewed