- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లాటప్పాగా CM కుర్చీలో కూర్చోలే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్.. మళ్లీ వచ్చిన ప్రజలను ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఓటమి తర్వాతనైనా కేసీఆర్‌లో మార్పు వస్తుందని ఆశించాం.. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని భావించాం.. కానీ, కేసీఆర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. మూడు నెలలకే ఈ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం ప్రారంభించారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగపోవడానికి నేనేం అల్లాటప్పాగా రాలేదు.. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి పదవిలోకి రాలేదు. కష్టపడి పైకి వచ్చానని అన్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్‌పై రేవంత్ సీరియస్ కామెంట్స్ చేశారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని గుర్తుచేశారు. కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని విభజన చట్టంలో చేర్చిందని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కూడా చేర్చిందని అన్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. విభజన చట్టంలోని పరిశ్రమలు, ప్రాజెక్టులను మోడీ సర్కారు రద్దు చేసిందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు తరలించిందని మండిపడ్డారు.