- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే MP సీట్లు ఎన్నో కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే ఎంపీ సీట్ల సంఖ్యపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 9 నుండి 13 ఎంపీ సీట్లు గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు.
సికింద్రాబాద్ స్థానంలో గతం కంటే మెరుగైన పోలింగ్ శాతం నమోదైందని.. ఈ స్థానంలో కాంగ్రెస్‌కు కనీసం 20 వేల మెజారిటీ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో బీజేపీ మూడవ స్థానంలోనే ఉంటుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బీజేపీకి పని చేశాయని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ వేవ్ ఏమి లేదని, కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి రాదని జోస్యం చెప్పారు. బీజేపీకి 220 లేదా 10 సీట్లు అటో ఇటో వస్తాయని అన్నారు.
ఇక, రేపటి నుండి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతామని తెలిపారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సమీక్షిస్తామని చెప్పారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్న బియ్యంపై ఫోకస్ పెడతానని పేర్కొన్నారు. ఫార్మార్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకుర్చుతామని, ఈ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 6 నాటికి రైతు బంధు పూర్తిగా ఇచ్చేశామని తెలిపారు. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను తక్కువ ధరకు ఇస్తామని తెలిపారు.