రాష్ట్ర ఆదాయం పెంపుపై CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Rajesh |
రాష్ట్ర ఆదాయం పెంపుపై CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై ఆయన గురువారం సమీక్షించారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలన్నారు. పన్నుల ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. జీఎస్టీ రిటర్న్స్ లలో అక్రమాలు జరగడానికి వీల్లేదు అన్నారు. మద్యం అమ్మకాలు పెరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగలేదన్నారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed