- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: అలా చేస్తే ట్రాఫిక్ జామ్‌లు తగ్గించొచ్చు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్(Lake View Guest House) వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్(Rain Water Sump) పనులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్(Hyderabad Traffic)లను తగ్గించవచ్చని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైయిన్ వాటర్ సంప్‌ల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇళంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.