- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలే: సీఎం రేవంత్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘‘బొర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంది. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలి. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తా. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్‌లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తాం. 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటా. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడగడం విచిత్రంగా ఉన్నది. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు.. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు.. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’’ అని రెండు పార్టీలపై మండిపడ్డారు.