- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ సభకు దీటుగా KCR ప్రతివ్యూహం.. గులాబీ బాస్ ప్లాన్‌పై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ..?
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని నేరుగా ఢీకొనాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే నెల 13న ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ ఖరారు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వ్యూహం పన్నుతారనే చర్చలు మొదలయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు పలు స్కీమ్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నది. దీనికి పోటీగా కేసీఆర్ కూడా ఒక రోజు ముందుగానే, ఆ తర్వాతగానీ పబ్లిక్ మీటింగ్ పెడతారా? లేక బడ్జెట్ సమావేశాలను అవకాశంగా తీసుకుని అసెంబ్లీనే వేదికగా చేసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ టూర్ ఫిక్స్ కావడంతో ఇక సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
గతేడాది జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ పాల్గొనే విజయ సంకల్ప సభ పేరుతో బహిరంగసభ పెడితే దానికి ముందు రోజు ప్రతిపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించి సవాళ్ళు విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి ప్రధాని ఏం జవాబు చెప్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. విజయసంకల్ప సభ జరిగినా కేసీఆర్ లేవనెత్తిన ఒక్క అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించలేదు. దేశం గురించి మాత్రమే చెప్పి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రికి ఊహించని తీరులో ప్రసంగించి వెళ్ళిపోయారు. ఆయన మౌనంపై రకరకాల విమర్శలు వచ్చినా కేసీఆర్‌ను లెక్కచేయలేదనేది పాపులర్ అయింది.
ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందేభారత్ రైలు సర్వీసును పచ్చ జెండా ఊపి ప్రారంభించడంతో పాటు పలు రైల్వే అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టేలే షెడ్యూలు ఖరారైంది. దీన్ని పసిగట్టిన సీఎం కేసీఆర్ దానికి ఒక రోజు ముందే (జనవరి 18న) ఖమ్మం టౌన్‌లో ఐదు లక్షల మందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ప్రధాని టూర్ వాయిదా పడింది. ఢిల్లీ నుంచే వర్చువల్‌గా పచ్చ జెండా ఊపి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించారు. మిగిలిన రైల్వే పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీన్ని ఊహించలేకపోయిన కేసీఆర్ యధావిధిగా సభను కంటిన్యూ చేశారు. ముగ్గురు సీఎంలను ఆహ్వానించి జన సమీకరణలో తనదైన ముద్ర వేశారు.
ప్రధాని మోడీ జనవరి టూర్ వాయిదా పడడంతో ఫిబ్రవరి 13న ఫిక్స్ అయింది. పలు రైల్వే డెవలప్‌మెంట్ పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రభుత్వపరంగానే పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ప్లాన్ రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి అందిన సాయంతో పాటు ఏయే శాఖ తరఫున ఏమేం ఇచ్చిందీ ఈ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉన్నది. దీనికి పోటీగా కేసీఆర్ ఏదేని జిల్లా సమీకృత కలెక్టర్ భవనాలకు శంకుస్థాపన లాంటి కార్యక్రమాలను ఒక రోజు ముందుగానీ తర్వాతగానీ ప్లాన్ చేస్తారా అనే చర్చ జరుగుతున్నది. లేదా ఎలాగూ బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్ కావడంతో అసెంబ్లీనే వేదికగా చేసుకుని కేంద్రంపై కేసీఆర్ నిప్పులు చెరుగుతారా అనే గుసగుసలు మొదలయ్యాయి.
ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బీజేపీ, బీఆర్ఎస్ ఉప్పు-నిప్పులా మారడంతో ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల జోరు పెరిగింది. ప్రధాని మోడీని కేసీఆర్ టార్గెట్ చేసినందున కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చిందేంటంటూ అసెంబ్లీ వేదికగానే నిలదీసే అవకాశం ఉన్నది. ప్రధాని మోడీ పబ్లిక్ మీటింగ్‌కు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ బహిరంగ సభను ప్లాన్ చేస్తారా లేక మరేదైనా వేదికను ఖరారు చేస్తారా అనేది కీలకంగా మారింది. రానున్న రెండు మూడు రోజుల్లో కేసీఆర్ వ్యూహం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఒక పార్టీని మరొకటి విమర్శించుకోవడం ద్వారా పొలిటికల్ మైలేజీ పొందాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఒక పార్టీ ఎత్తుకు మరో పార్టీ పైఎత్తు వేస్తున్నది. ఈసారి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నది.
Also Read...