- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చివరి రక్తం బొట్టువరకు కట్టుబడి ఉంటాం.. సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : చివరి రక్తం బొట్టువరకు గంగాజమునా తెహజీబ్ కు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ 10ఏళ్ల పాలనలో 1180కోట్లు మైనార్టీల కోసం ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలోనే 12వేలకోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
ఇండస్ట్రీ, ఐటీలో పురోగతి సాధించామని తెలిపారు. రాష్ట్రంలో సాగు, తాగునీటితో పాటు కరెంటు సమస్య తీరిందన్నారు. నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతుందన్నారు. తెలంగాణ వచ్చాక మన జీవితాలు బాగుపడ్డాయన్నారు. దేశం కూడా రాష్ర్టం సాధించిన అభివృద్ధి లాగే చెందాలన్నదే ఆకాంక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైనార్టీ నాయకులు, భారీగా పాల్గొన్నారు.
Also Read..
బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయండి.. ఈసీకి MLA రఘునందన్ రావు ఫిర్యాదు