BIG Alert: ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండండి.. టెలికాం యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!

by Maddikunta Saikiran |
BIG Alert: ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండండి.. టెలికాం యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​Frauds) రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) తాము ప్రభుత్వ అధికారులమంటూ డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో సామాన్యులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బును కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కేసులు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) అలర్ట్ అయ్యింది. సైబర్ మోసాలు పెరుగుతున్న కారణంగా టెలికాం యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజులు వస్తే స్పందించొద్దని తెలిపింది.

ముఖ్యంగా +8, +85, +65 వంటి ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నంబర్ల నుంచి కాల్స్ చేసి తాము గవర్నమెంట్ ఆఫీసర్లమంటూ బెదిరించి మనీ నొక్కేస్తున్నారని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాతి వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/లోని 'ఛక్షు(Chakshu)' ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. టెలికాం కంపెనీలు కూడా స్పామ్ కాల్స్, ఇంటర్నేషనల్ కాల్ అని సూచించేల యూజర్లకు అవగాహనా కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DOT) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డాట్ తెలిపింది.

Advertisement

Next Story