డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

by Kalyani |
డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
X

దిశ, వరంగల్ టౌన్ : బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం హన్మకొండ పరిధిలోని జంతు ప్రదర్శనశాల, భద్రకాళి బండ్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. అడ్వకేట్స్ కాలనీ, నంది హిల్స్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ప్రభావానికి జూ పార్కులో ముంపు ఏర్పడుతుందని, అందుకు బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రకాళి బండ్ ను పర్యటించిన కమిషనర్ చెరువులో నీటిని తొలగించిన సందర్భంగా డిసిల్టింగ్ ప్రక్రియ చేపట్టడానికి గల అవకాశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చెరువులో ఉన్న గుర్రపు డెక్క అవశేషాలను గమనించి వాటి ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా ఫైబర్ ను సేకరించేలా శిక్షణ ఇచ్చి ఎస్ హెచ్ జీ మహిళలను ప్రోత్సహించి ఉపాధి పొందేలా చూడాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, కుడా బల్దియా ఈఈలు భీమ్ రావు, సంతోష్ బాబు, ఏసిపిలు రజిత, ఏర్షాద్, ఏఈ మేనక, సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed