Dhankhad: సర్జరీకి కిచెన్‌లోని కత్తి వాడొద్దు.. అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ధన్‌ఖడ్

by vinod kumar |
Dhankhad: సర్జరీకి కిచెన్‌లోని కత్తి వాడొద్దు.. అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ధన్‌ఖడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagadeep dhankad) తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బైపాస్ సర్జరీ కోసం కూరగాయలను కోసే కత్తిని ఎప్పుడూ ఉపయోగించొద్దని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహిళా జర్నలిస్టులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఒక్కసారి చూడండి. దానిని చూస్తే మీరు ఎంతో షాక్ అవుతారు. బైపాస్ సర్జరీకి ఎప్పుడూ కూరగాయలు కోసే కత్తిని ఉపయోగించొద్దని మాజీ ప్రధాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇప్పటి వరకు ఎవరు అలా చేయలేదు. ఆ నోటీసు కూరగాయల తరిగే కత్తి కూడా కాదు. అది మొత్తం తుప్పు పట్టింది. తొందరపాటుతో వచ్చింది. దానిని చదివి ఎంతో ఆశ్చర్యపోయా’ అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత జర్నలిస్టులపైనే ఉంటుందని నొక్కి చెప్పారు. కొన్ని విరుద్ద సూత్రాలకు రాజీపడి పని చేస్తే డెమోక్రసీ ముందుకెళ్లలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed