అలుగును వేటాడిన వ్య‌క్తులు అరెస్ట్‌..

by Kalyani |
అలుగును వేటాడిన వ్య‌క్తులు అరెస్ట్‌..
X

దిశ‌,ఏటూరునాగారంః- అలుగు,ఇండియ‌న్ పాంగోలిన్‌(మ‌ణిస్ క్రాసికాటాడా) అంత‌రించిపోతున్న అట‌వీ జంతువును వేటాడి విక్ర‌యానికి సిద్దంగా ఉంచిన న‌లుగురు వ్య‌క్తుల‌ను అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకున్నారు. ఏటూరునాగారం అట‌వీ శాఖ డివిజ‌న‌ల్ అధికారి ర‌మేష్ తెలిపిన వివరాల మేర‌కు..క‌న్నాయిగూడెం మండ‌లం భూప‌తి పూర్‌,క‌మాన్ ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత మంది అట‌వీ జీవి అలుగును వేటాడి విక్రయానికి సిద్దంగా ఉంచారన్న విశ్వ‌స‌య‌నీయ స‌మాచారం మేర‌కు అ ప్రాంతంలో మూడు రోజులుగా విస్తృత త‌నిఖీలు నిర్వ‌హించామ‌ని, ఈ క్ర‌మంలోనే చిధం ర‌వి, కోరం నాగాయ్య‌, కోరం పెంట‌య్య‌, కోరం కృష్ణ మూర్తిని అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద బ్ర‌తికి ఉన్న ఇండియ‌న్ పాంగోలిన్‌(అలుగు)ను ర‌క్షించడం జ‌రిగింద‌ని అన్నారు.అదుపులోకి తీసుకున్న వ్య‌క్తుల వ‌ద్ద నుండి పాంగోలిన్ స్కేల్స్‌(అలుగు చ‌ర్మం) , గొడ్డ‌లి, క‌త్తి, వంట పాత్ర‌ల‌తో స‌హ ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఏఫ్ డీ వో ర‌మేష్ తెలిపారు.

ప‌ట్టుబ‌డిన వ్య‌క్తుల‌ను విచారించగా ఏటూరునాగారం వ‌న్య‌ప్రాణి డివిజ‌న్‌లోని ఫారెస్ట్ కంపార్ట్ మెంట్ ల‌లో పాంగోలిన్ ల‌ను వేటాడి అక్ర‌మ వ‌న్య‌ప్రాణుల మార్కెట్‌లో విక్ర‌యించాల‌ని ఉద్దేశంతో వేటాడినట్లు నిందితులు అంగిక‌రించార‌ని, పట్టుబ‌డిన వ్య‌క్తులు గతంలో మ‌రోక పాంగోలిన్‌(అలుగు)ను వేటాడి తిన్నార‌ని, దాని స్కేల్‌(చ‌ర్మం)ను విక్ర‌యించ‌డం కోసం ఉంచుకున్నార‌ని వెల్ల‌డించారు. పాంగోలిన్ మాసంకు, చ‌ర్మానికి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో విఫ‌రీతంగా డిమాండ్ ఉంద‌ని వారు తెలిపారు. కాగా అట‌వీ శాఖ వ‌న్య‌ప్రాణుల ర‌క్షణ చ‌ట్టం 1972 పీవో ఆర్ నెంబ‌ర్‌2730-55 ప్ర‌కారం కేసు న‌మోదు చేసి ములుగులోని జూడియ‌ల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హ‌జ‌రు ప‌రిచి జ్యుడిషియ‌ల్ రిమాండ్ త‌ర‌లించామ‌ని, నిందితులంద‌ర‌ని ప‌ర‌కాలు జైలుకు 14 రోజులు రిమాండ్‌కు త‌ర‌లించడం జ‌రిగింద‌ని తెల‌పారు.

Advertisement

Next Story

Most Viewed