- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drinker Sai: ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది.. ‘డ్రింకర్ సాయి’పై హైప్ పెంచేస్తున్న హీరో కామెంట్స్
దిశ, సినిమా: ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai). ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalashetty) దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘డ్రింకర్ సాయి’ మూవీ ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ధర్మ సినిమా హైలైట్స్‌ను పంచుకున్నారు.
హీరో ధర్మ మాట్లాడుతూ.. ‘‘డ్రింకర్ సాయి సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. మొదట అనుకున్న కథకు లాక్ డౌన్‌లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు మా డైరెక్టర్ కిరణ్. నేను సాయి అనే క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్‌ను అబ్సర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్స్‌కు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు అట్రాక్ట్ చేయడం కోసం ట్రైలర్, టీజర్‌లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాలకు నచ్చుతుంది. థియేటర్లలో చూసి సపోర్ట్ చేయండి’ అని తెలిపారు.
Read More...
NTR: అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన "ఎన్టీఆర్"