- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kannappa: ‘కన్నప్ప’ హైప్ క్రియేట్ చేస్తున్న యానిమేటెడ్ వీడియో..
దిశ, సినిమా: హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) నుంచి ప్రతీ వారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. అంతే కాకుండా ఇందులో నటిస్తున్న దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. అయితే ఈ సారి ‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్స్ (Animated Comic Books) రూపంలో మరో వైవిధ్యమైన ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తాజాగా కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్-1 పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘అద్భుతమైన భక్తి రసాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే సినిమా కన్నప్ప’ అంటూ మొదలైన ఈ వీడియోలో అసలు కన్నప్ప ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు.
భక్తికి, త్యాగానికి పరమార్థం చెప్పిన సినిమా ఇది. మానవత్వానికి, దైవత్వానికి ఉన్న అనుబంధాన్ని చెప్పేదే ఈ సినిమా అంటూ ఈ వీడియో ద్వారా కన్నప్ప మూవీపై అంచనాలు పెంచేశారు మేకర్స్. మొత్తంగా చెప్పాలంటే ఈ యానిమేటెడ్ ఆడియో బుక్ కన్నప్పపై హైప్ పెంచేసింది. కన్నప్ప కథ తెలియని వారికి కూడా ఈ సినిమా కథని సూచన ప్రాయంగా తెలిపి ఆకట్టుకున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది.