- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Satya Surya Bank:‘ప్రతి ఒక్కరి బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తా’.. సంచలన సెల్ఫీ వీడియో విడుదల

దిశ, కొత్తపేట : కోట్ల రూపాయలకు టోకరా పెట్టి వెళ్లిపోయిన కూర్మదాసు హేమంచత్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో తాను కొత్తపేటకు తిరిగి వస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరి బంగారం తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కొత్తపేటలోని సత్య సూర్య బ్యాంకు బోర్డు తిప్పేసింది. బాధితుల నగదు, బంగారాన్ని కూర్మదాసు హేమంత్ అనే వ్యాపారి పట్టుకుని వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులు పైనే గడుస్తున్నా హేమంత్ ఆచూకీ తెలియలేదు. అయితే హేమంత్ ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.
తాను వేరే రాష్ట్రంలో ఉన్నట్లు అతి త్వరలోనే బయటకు వస్తానని చెప్పిన వీడియో వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడం వల్లే తాను పారిపోయినట్లు చెప్పాడు. వాసు అనే వ్యక్తి దగ్గర రియల్ ఎస్టేట్ కోసం తన బావ కుమారస్వామితో కలిసి పెట్టుబడులు పెట్టామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో వాసు అనే వ్యక్తి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చాడని, దిక్కు తోచని స్థితిలో తాను ఊరు వదిలి వెళ్ళిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన బావ అయిన కుమార్ స్వామి వల్ల తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం భద్రంగానే ఉందని చెప్పాడు. తనతో పాటు వాటాదారులైన శ్రీకాకుళపు రాము, అతని తండ్రి సత్తిబాబు దగ్గర కొంత బంగారం ఉంచానని చెప్పాడు. ఏ ఒక్కరి బంగారం తాను కరిగించలేదని తెలిపాడు. ప్రతి ఒక్కరు బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో పోలీసులకు లొంగిపోయి వివరాలన్నీ చెబుతానన్నాడు.