- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీర్ పేట్ హత్యకేసులో కీలక ఆధారాలు లభ్యం..

దిశ, మీర్ పేట్ : మీర్ పేట్ లో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఈ సంవత్సరం జనవరిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతి క్రూరంగా హత్య చేసి బకెట్ లో శరీర భాగాలు ఉడకబెట్టి అనంతరం ఆ ఎముకలను బూడిదిగా చేసి చెరువులో పడేసి మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడు. అనంతరం తనకేం తెలియదు అనే విధంగా నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవి తనతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయిందని వెంకట మాధవి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
హైదరాబాద్ చేరుకున్న వెంకట మాధవి తల్లిదండ్రులు తన కూతురు కనిపించడం లేదని మృతురాలి తల్లిదండ్రులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గురుమూర్తి అద్దెకు ఉండే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన రీతిలో విచారించగా గురు మూర్తి నేరం అంగీకరించాడు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గురైన వెంకట మాధవి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అదునాతన టెక్నాలజీని ఉపయోగించి బాత్రూంలో దొరికిన రక్త నమూనాల ఆధారంగా తల్లి, పిల్లల డీఎన్ఏతో హత్యకు గురైన వెంకట మాధవి డీఎన్ఎ ఒక్కటేనని ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. డీఎన్ఏ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్న పోలీసులు.