- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijay Deverakonda: ‘సమ్మర్ ఫ్లాన్నెల్స్ ధరించి మళ్లీ లంకా రాజ్యానికి బయలుదేరుతున్నాం’.. ఆకట్టుకుంటోన్న రౌడీ హీరో పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో సైడ్ క్యారెక్టర్ రోల్‌లో అవకాశాలు దక్కించుకుని.. మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా నటించి మెప్పించాడు. పెళ్లి చూపులు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే విజయ్ దేవరకొండ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. తర్వాత 2017 లో ద్వారక మూవీలో చాన్స్ కొట్టేశాడు. కానీ ఈ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ చిత్రంతో పెద్ద స్టార్‌గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావె లో నటించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చూశాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 2018 నవంబర్ 17న టాక్సీవాలాతో మరొక చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ (Kingdom) సినిమాలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ క్రమంలో విజయ్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘పిచ్చి కూల్ సమ్మర్ ఫ్లాన్నెల్స్ ధరించి.. ప్రేమ పాటల చిత్రీకరణ కోసం మళ్లీ లంక రాజ్యానికి బయలుదేరుతున్నాం’’. అంటూ విజయ్ పోస్ట్ లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా చేతిలో పాస్‌పోర్టుతో స్టన్నింగ్ స్టిల్స్‌కు ఫోజులిచ్చాడు.