యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఆగడాలను నివారించాలి : బీజేపీ

by Naveena |
యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఆగడాలను నివారించాలి : బీజేపీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ‌ నాయకులు దౌర్జన్యాలకు, వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని బీజేపీ గుట్ట పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్టలో‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకు అంజనపురి కాలనీలో ప్లాట్లు కేటాయిస్తే ఆ ప్లాట్లను ను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కొబ్బరి బొండాల దుకాణం నుండి హోటల్లు పెట్రోల్ బంకుల దాకా కాంగ్రెస్ నాయకుల వసూళ్ల పర్వం కొనసాగుతుందన్నారు. పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న హెచ్ పీ బంక్ యజమానిని కూడా ఇద్దరు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్న కూడా ఖచ్చితంగా తమకు పైసలు ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో బంకు పని నడవదని హెచ్చరించినట్లు ఆరోపించారు.

ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా తెలువక జరుగుతుందా అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దౌర్జన్య, కబ్జా రాజకీయాలు మానకపోతే భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించడం‌‌ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జిల్లా భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షులు బంధారపు మల్లేష్ గౌడ్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నందోజి నరేష్ ,కిసాన్ మోర్చా అధ్యక్షులు సుడిగు రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు బోడ బుచ్చిబాబు, సీనియర్ బిజెపి నాయకులు రంగసత్యం బెల్దే అశోక్ ,జవహర్ ,మిట్ట వీరేష్, గౌడ్ ఆలేటి కర్ణ ,జగిని నవీన్, ఆకుల దేవేందర్, బొమ్మ నరేష్, భోగా అజయ్, సంద ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Next Story