వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

by Naveena |
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
X

దిశ,వనపర్తి : వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో వినియోగదారులకు హక్కుల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డిజిటల్ విధానం ద్వారా వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చని, అదేవిధంగా వర్చువల్ హియరింగ్ ద్వారా సకాలంలో సత్వర న్యాయం పొందవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, సివిల్ సప్లై డిఎం రమేష్,ఆయా శాఖల అధికారులు, వినియోగదారులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed