- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీనగర్ చౌరస్తాలో సర్కిల్ ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే సబితా
దిశ, బడంగ్ పేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా మున్సిపాలిటీ అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మంగళవారం బడంగ్ పేట్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ చౌరస్తా ను రోడ్డు వెడల్పు చేసి అక్కడ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారును ఆదేశించారు. అక్కడి నుంచి నాదర్ గూల్కు వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రోడ్డుపైన ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఒకవేళ మార్చి నెల గడువు దాటి పనులు పూర్తి కాకపోతే మంజూరయిన నిధులు కూడా రద్దవుతాయని, వెంటనే త్వరపడాలన్నారు. సర్కిల్ ఏర్పాటు చేసే ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఫ్లోర్ లీడర్ సూర్ణగంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.